అప్పుల బాధతో కారు డ్రైవర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కారు డ్రైవర్‌ ఆత్మహత్య

Published Fri, Oct 20 2017 12:13 PM

Unable to pay EMI on new car,  driver commits suicide

సాక్షి, హైదరాబాద్ : అప్పుల బాధతో ఓ కార డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌, బీరప్పగడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నాగ మహేశ్‌ ఫైనాన్స్‌లో కారు కొనుక్కొని క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు.

అయితే ఆదాయం అంతంత మాత్రమే ఉండటంతో ఫైనాన్స్‌ కట్టడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో చేసిన అప్పులు ఎక్కువవడంతో చేసేదేమిలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే పైనాన్స్ వ్యాపారుల వేదింపులే మహేశ్‌ ఆత్మహత్యకు కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  

Advertisement
Advertisement